CM Nitish Kumar | పాట్నా, అక్టోబర్ 5: బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ పాట్నాలో శనివారం పోస్టర్లు వెలిశాయి. నితీశ్‌కుమార్ జేడీ(యూ) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన బీర్చంద్ పటేల్ మార్గ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం ప్రవేశద్వారం సహా నగరంలో పలుచోట్ల ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయితే, తమ పార్టీ అధికారికంగా ఈ డిమాండ్ చేయలేదని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
న్యూఢిల్లీ,: భవిష్యత్తులో కొవిడ్ లాంటి మహమ్మారులు వచ్చినా వాటిని ఎదుర్కొనే సన్నద్ధతపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రచంచ బ్యాంక్ గ్రూప్ (డబ్ల్యూబీజీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సహకారాన్ని పెంచాయి. ఆరోగ్య విపత్తుల కారణంగా ఎదురయ్యే సవాళ్లు అధిగమించడానికి ఐఎంఎఫ్‌కు చెందిన రిసైలెన్స్ అండ్ సస్టయినబిలిటీ ట్రస్ట్ ద్వారా ఆయా దేశాలకు తక్కువ వడ్డీకి ఆర్థిక సాయం దక్కనున్నది.