Amazon | ఎక్స్‌బాక్స్ కంట్రోలర్‌ని ఆర్డర్ చేస్తే.. పార్శిల్లో పాము వచ్చింది.. బెంగళూరు జంటకు షాకింగ్ అనుభవం
Amazon | బెంగళూరు జంటకు ఆన్లైన్ షాపింగ్‌లో షాకింగ్ అనుభవం ఎదురైంది. అమెజాన్‌లో ఎక్స్‌బాక్స్ కంట్రోలర్ (Xbox controller)ని ఆర్డర్ చేయగా.. పార్శిల్లో విషపూరితమైన పాము (Live Cobra) దర్శనమిచ్చింది.
Amazon | ఆన్లైన్ షాపింగ్ (Online Shopping) గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. తమకు కావల్సిన వస్తువులను ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే, కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన ఉత్పత్తులు మిస్ప్లేస్మెంట్లు జరుగుతుంటాయి. ఒకటి ఆర్డర్ పెడితే దానికి బదులుగా మరో వస్తువు డెలివరీ అవుతుంటుంది. ఫోన్లు ఆర్డర్ చేస్తే బిస్కెట్లు, స్టోన్స్ (రాళ్లు) వంటివి పార్శిల్స్‌లో వచ్చిన ఘటనలను ఇప్పటికే అనేకం చూశాం. అయితే, తాజాగా బెంగళూరు జంటకు ఆన్లైన్ షాపింగ్‌లో షాకింగ్ అనుభవం ఎదురైంది.
బెంగళూరు నగరంలోని సర్జాపూర్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ జంట ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఎక్స్‌బాక్స్ కంట్రోలర్ (Xbox controller)ని ఆర్డర్ చేశారు. పార్శిల్ ఇంటికి డెలివరీ అయ్యింది. ఎంతో ఆత్రుతతో ఆ జంట పార్శిల్‌ను ఓపెన్ చేయగా అందులో విషపూరితమైన పాము (Live Cobra) బుసలుకొడుతూ దర్శనమిచ్చింది. దీంతో ఆ జంట ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ పాము కొరియర్ బాక్స్‌కు వేసిన టేప్‌కు అతుక్కుని చిక్కుకుపోవడంతో వారికి పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ జంట ఎక్స్ వేదిగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
In a shocking incident, a family on Sarjapur Road received a live Spectacled Cobra with their Amazon order for an Xbox controller.
The venomous snake was fortunately stuck to packaging tape, preventing harm.#ITReel #Sarjapur #AmazonOrder #SnakeInAmazonOrder pic.twitter.com/EClaQrt1B6
— Prakash (@Prakash20202021) June 19, 2024
Also Read..
Earthquake | ఇరాన్‌ను వణికించిన భూకంపం.. నలుగురు మృతి
Harish Rao | నాణ్యమైన విద్య అందించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం : హరీశ్ రావు
Rajya Sabha MPs Daughter: నిద్రిస్తున్న వ్యక్తి మీద నుంచి కారు నడిపిన ఎంపీ కూతురు..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

