ములుగు, (నమస్తేతెలంగాణ)/తాడ్వాయి,జనవరి11 : సమ్మక్క-సారలమ్మ జాతర తెలంగాణ ప్రజల హృదయ స్పందన అని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం ఆయన మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి పర్యటించారు. సమ్మక్క-సారలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి మీడియాతో మాట్లాడారు.
జాతర ప్రత్యేకత, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఇందుకు ప్రభుత్వం రూ.260కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ మహా జాతరను విజయవంతం చేయాలని సూచించారు.