బెంగళూర్ : దక్షిణాదిలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 11న పట్టాలెక్కింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ట్రైన్ నుంచి ఓ వీడియో నెటిజన్లలో దేశభక్తిని ప్రేరేపిస్తోంది. ట్రైన్‌లోపల వందే మాతరం ట్యూన్‌కు అనుగుణంగా బెంగళూర్ విద్యార్ధి ఫ్లూట్ ప్లే చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Aprameya Seshadri, a 12th student from Bengaluru, playing the wonderful Vande Mataram tune on the flute! #IndianRailways #VandeBharatTrain #VandeBharat pic.twitter.com/q89cwfccIa
— Ananth Rupanagudi (@Ananth_IRAS) November 11, 2022
ఐఆర్ఏఎస్ అధికారి అనంత్ రూపనగుడి ఈ క్లిప్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. అపర్మేయ శేషాద్రి, ఫ్లూట్పై వందే మాతరం ట్యూన్‌ను అద్భుతంగా ప్లే చేశాడని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 6700 వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు స్పందించారు. అపర్మేయ టాలెంట్ అద్భుతమని కొనియాడారు.