న్యూఢిల్లీ: అద్భుతమైన చారిత్రక కట్టడం ‘తాజ్‌మహల్’పై బీజేపీ ఎంపీ రాజ్‌కుమార్ చాహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్‌మహల్ రక్షణ నిబంధనలు ఆగ్రాకు శాపంగా మారాయని, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పనకు పెద్ద అడ్డంకిగా మారాయని ఆరోపించారు. బుధవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ, తాజ్ ట్రాపెజియం జోన్, ఎన్జీటీ కఠిన నిబంధనలు ఆగ్రాలో పరిశ్రమలు స్థాపించకుండా అడ్డుకుంటున్నాయని, దీనివల్ల యువతలో నిరుద్యోగం పెరుగుతున్నదని అన్నారు. చారిత్రక కట్టడం అందాన్ని కాపాడటంతోపాటు, అభివృద్ధిని సమతుల్యం చేసేందుకు ఆగ్రాలో ఐటీ హబ్‌ను ఏర్పాటుచేయాలని చాహర్ డిమాండ్ చేశారు.