న్యూఢిల్లీ: హర్యానాలో ఇటీవల కారు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌కు నిర్వహించిన వేలంపాట దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. రూ.1.17 కోట్లకు వేలం పాటను గెలుచుకొని, ఫ్యాన్సీ నంబర్‌ను సొంతం చేసుకున్న బిడ్డర్ సుధీర్‌కుమార్.. అటు తర్వాత పూర్తి మొత్తం చెల్లించకుండా ముఖం చాటేశాడు.
గడువులోగా (డిసెంబర్ 1) డబ్బు చెల్లించనందున సుధీర్‌కుమార్ ఆస్తులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ‘హెచ్ఆర్88బీ8888’ నంబర్‌కు మళ్లీ వేలం నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు.