న్యూఢిల్లీ: భారతదేశపు మొదటి సహకార అద్దె రవాణా ప్లాట్ఫామ్ ‘భారత్ ట్యాక్సీ’ పైలట్ ట్రయల్స్ మంగళవారం ఢిల్లీ, గుజరాత్లో ప్రారంభమయ్యాయి.
కేవలం పది రోజుల్లో ఢిల్లీ, సౌరాష్ట్ర రీజియన్లలో ఈ సర్వీసులు అందించడానికి సహకార్ ట్యాక్సీ కో ఆపరేటివ్ లిమిటెడ్లో 51 వేలకు పైగా డ్రైవర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ ప్లాట్ఫామ్లో కస్టమర్ల నుంచి వచ్చే మొత్తం డబ్బు డ్రైవర్లకే అందుతుంది.