Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ పాఠశాల బస్సును (school bus) అడ్డగించిన కొందరు వ్యక్తులు డ్రైవర్‌పై దాడి చేశారు. ఈ ఘటన ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1 (Electronic City Phase 1) సమీపంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది.
సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఓ స్కార్పియో కారు, బైక్‌లపై వచ్చిన 8 నుంచి 9 మంది వ్యక్తులు పాఠశాల బస్సును అడ్డగించి దాడి చేశారు. ఇనుప వస్తువులతో బస్సు కిటికీని ధ్వంసం చేశారు. అనంతరం డ్రైవర్‌పై దాడి చేశారు. ఈ ఘటనతో బస్సులోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దాడికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనపై బెంగళూరు రూరల్ జిల్లా హెబ్బగోడి పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దాడి ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
FIR has been registered at Hebbagodi PS of Bengaluru Rural District, Investigation is underway. https://t.co/RkVVIMG0uC
— ಬೆಂಗಳೂರು ನಗರ ಪೊಲೀಸ್ BengaluruCityPolice (@BlrCityPolice) September 17, 2024
Also Read..
Atishi | ఢిల్లీకి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఉన్నారు.. అది కేజ్రీవాలే : అతిశీ ఫస్ట్ రియాక్షన్
JIO Down | జియో సేవల్లో అంతరాయం.. నెట్వర్క్ రావట్లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు
ED raids | ఆర్జీ కార్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఫామ్ హౌస్‌లో ఈడీ సోదాలు