man kills brother-in-law | వివాహిత చెల్లితో సంబంధం.. బావమరిదిని హత్య చేసిన బావ
man kills brother-in-law | భార్య సోదరుడైన బావమరిది పెళ్లైన తన చెల్లితో సంబంధం పెట్టుకోవడంపై బావ ఆగ్రహించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని హత్య చేశాడు. ఆ తర్వాత కారులో మృతదేహాన్ని ఉంచి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయాడు.
బెంగళూరు: భార్య సోదరుడైన బావమరిది పెళ్లైన తన చెల్లితో సంబంధం పెట్టుకోవడంపై బావ ఆగ్రహించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని హత్య చేశాడు. ఆ తర్వాత కారులో మృతదేహాన్ని ఉంచి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయాడు. (man kills brother-in-law) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బైరప్పనహళ్లి ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల శ్రీనివాస్, డాగ్ కెన్నెల్ నిర్వహిస్తున్నాడు. భార్య తమ్ముడైన 24 ఏళ్ల రంజిత్, పెళ్లైన తన చెల్లితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు శ్రీనివాస్ తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో వారి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి.
కాగా, మార్చి 26న ఈ వివాదంపై మాట్లాడేందుకు బావమరిది రంజిత్ను బావ శ్రీనివాస్ పిలిచాడు. బన్నెరఘట్ట సమీపంలోని ఒక ప్రాంతానికి కారులో తీసుకెళ్లాడు. మాటల సందర్భంగా ఆగ్రహించిన శ్రీనివాస్ ఐరాన్ రాడ్తో రంజిత్ తలపై కొట్టి హత్య చేశాడు.
మరోవైపు శ్రీనివాస్ ఆ తర్వాత బావమరిది రంజిత్ మృతదేహాన్ని కారులో ఉంచాడు. నేరుగా బన్నెరఘట్ట పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
woman finds Rs 10 crore in account | బ్యాంకు ఖాతాలో పది కోట్లు.. ఇది చూసి షాకైన మహిళ
Man Beheads Ice-Cream Seller | ఐస్క్రీం వ్యాపారి తల నరికిన వ్యక్తి.. తెగిన తలను ఇంటికి తీసుకెళ్లాడు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

