భువనేశ్వర్: కామాఖ్య ఎక్స్ప్రెస్ (Kamakhya Express) రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాల పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒడిశాలోని కటక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం 11.54 గంటల సమయంలో కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి అస్సాం రాజధాని గౌహతిలోని కామాఖ్య స్టేషన్కు వెళ్తున్న కామాఖ్య ఎక్స్ప్రెస్ నిర్గుండి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. 11 కోచ్లు రైలు పట్టాలు తప్పి ఒరిగిపోయాయి.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో సుమారు పది మంది ప్రయాణికులు గాయపడినట్లు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురు ప్రయాణికులను సమీపంలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు సంఘటనా స్థలానికి సహాయక రైలును పంపినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో) అశోక్ కుమార్ మిశ్రా తెలిపారు. బాధిత ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా రైల్వే లైన్ పునరుద్ధరించడం తమ ప్రాధాన్యత అని అన్నారు. ధౌలి ఎక్స్ప్రెస్, నీలాచల్ ఎక్స్ప్రెస్, పురూలియా ఎక్స్ప్రెస్ను దారి మళ్లించినట్లు వివరించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదంపై సమాచారం కోసం 8455885999, 8991124238 హెల్ప్లైన్లను రైల్వే అందుబాటులోకి తెచ్చింది.
12551 SMVT Bengaluru – Kamakhya AC Express derailed at Manguli near Cuttack/KUR DIV/ECoR
No casualty or injuries yet reported.
Officials confirmation from @EastCoastRail will be updated soon#TrainDerailment pic.twitter.com/xLEHyHZUAA
— ECoR Railfans (@ecor_railfans) March 30, 2025