Woman Dies After Delivery | పశ్చిమబెంగాల్ (West Bengal)లోని ఓ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. డెలివరీ అయిన తర్వాత మహిళ ప్రాణాలు కోల్పోయింది (Woman Dies After Delivery). అయితే, ఆమె మృతికి వైద్యులు ఇచ్చిన ఇంజక్షనే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.
మిడ్నాపూర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో (Midnapore Medical College and Hospital) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ బుధవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. మరో నలుగురు మహిళల ఆరోగ్యం సైతం డెలివరీ తర్వాత క్షీణించింది. దీంతో ఈ వ్యవహారంపై బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ సమయంలో సదరు మహిళలకు ఇచ్చిన ఇంట్రావీనస్ (IV) ఇంజక్షన్ గడువు ముగిసిందని పేర్కొంటున్నారు. అదే మహిళ మృతికి కారణమని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మృతురాలి భర్త కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ విషయంపై దర్యాప్తు చేపట్టింది. ఇందుకోసం 13 మంది సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
Also Read..
HMPV Case | అస్సాంలో 10 నెలల చిన్నారికి HMPV పాజిటివ్.. ఈ సీజన్లో ఇదే తొలి కేసు
K Annamalai | హిందీ భాషపై అశ్విన్ వ్యాఖ్యలు.. అన్నామలై ఏమన్నారంటే..?
Monkey | మహిళ తలపైకి ఎక్కి.. షాపింగ్ మాల్లో గందరగోళం సృష్టించిన కోతి.. VIDEO