Buddhadeb Bhattacharya | పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (Buddhadeb Bhattacharya) కుమార్తె సుచేతన భట్టాచార్య (Suchetana Bhattacharya) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పురుషుడిలా మారాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు లింగమార్పిడి చేయించుకోనున్నట్లు (sex reassignment surgery) ప్రకటించారు.
తాను పుట్టుకతో మహిళ అయినప్పటికీ చిన్నప్పటి నుంచీ పురుషుడిలాగానే జీవించినట్లు తెలిపారు. ఇప్పుడు శారీరకంగా పురుషుడిలా మారాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇటీవలే నిర్వహించిన ఓ ఎల్జీబీటీక్యూ (LGBTQ) వర్క్ షాప్ కు హాజరైన తర్వాత ఈ విషయంపై తనకు పూర్తి అవగాహన వచ్చిందన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇదే విషయంపై న్యాయ నిపుణులు, వైద్యుల సలహాలు తీసుకున్నట్లు చెప్పారు. తాను పురుషుడిగా మారిన తర్వాత తన పేరును సుచేతన భట్టాచార్య నుంచి సుచేతన్ గా మార్చుకోనున్నట్లు పేర్కొన్నారు.
‘నా వయసు ఇప్పుడు 41. నా జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు నేను తీసుకోగలను. అదే విధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నా ఈ నిర్ణయం వల్ల నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్య లేదు. దయచేసిన నా తల్లిదండ్రులను ఇందులోకి లాగొద్దు. మానసికంగా నన్ను నేను పురుషుడిగా భావిస్తున్నా. ఇప్పుడు భౌతికంగానూ పురుషుడిగా మార్పును కోరుకుంటున్నాను’అని వెల్లడించారు.
Also Read..
Uber LayOff | లేఆఫ్స్ ప్రకటించిన ఉబర్.. ఆ 200 మందిని తొలగించనున్న సంస్థ
Imran Khan | ఇమ్రాన్ ఖాన్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ
Varun-Lavanya | లావణ్య ఫోన్ వాల్ పిక్‌లో వరుణ్ ఫొటో.. షేర్ చేసిన కాబోయే మెగా కోడలు