Varun-Lavanya | లావణ్య ఫోన్ వాల్ పిక్‌లో వరుణ్ ఫొటో.. షేర్ చేసిన కాబోయే మెగా కోడలు
Varun-Lavanya | టాలీవుడ్ యాక్టర్లు వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఇటీవలే ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత వరుణ్-లావణ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు. తాజాగా లావణ్య ఓ ఆసక్తికర ఫొటోను అభిమానులతో పంచుకుంది.
Varun-Lavanya | టాలీవుడ్ యాక్టర్లు వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఇటీవలే ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే నాగబాబు నివాసంలో మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబం, లావణ్య కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత వరుణ్-లావణ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు. లావణ్య తన చేయి పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న స్టిల్ ను వరుణ్ షేర్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా లావణ్య సైతం ఓ ఆసక్తికర ఫొటోను అభిమానులతో పంచుకుంది. తన ఫోన్ వాల్ పిక్ (Phone Wall Pic)ను ఇన్ స్టాలో షేర్ చేసింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పలు ప్రత్యేక సందర్భాల్లో దిగిన పలు ఫొటోలను ఉపయోగించి ఈ వాల్ పిక్ ను లావణ్య సిద్ధం చేసింది. ఈ పిక్ లో తనకు కాబోయే భర్త వరుణ్ ఫొటో కూడా కనిపించింది. ఈ పిక్ లో ‘మై లవ్స్.. డ్రీమ్ బిగ్గర్’ అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మరో సినిమా కూడా చేస్తున్నాడు.
లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తమిళంలో అథర్వతో కలిసి సినిమా చేస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై స్కైలాబ్ ఫేం విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హాట్ స్టార్ వెబ్‌సిరీస్‌లో కూడా నటిస్తోంది.
Also Read..
Assam Floods | అస్సాంను ముంచెత్తిన వరదలు.. చిక్కుకున్న 1.20 లక్షల మంది
Kerala | విడాకులపై కోర్టు తీర్పుతో అసంతృప్తి.. జడ్జి కారు ధ్వంసం చేసిన భర్త
ED Raids | మెడికల్ కాలేజీల్లో రెండో రోజు కొనసాగుతున్న ఈడీ సోదాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

