Imran Khan | ఇమ్రాన్ ఖాన్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan ) పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు (non-bailable arrest warrants) జారీ అయ్యాయి.
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan ) పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు (non-bailable arrest warrants) జారీ అయ్యాయి. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ ను ఇటీవలే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ అరెస్ట్ తో పాక్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి.
మే 9న జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇమ్రాన్ సహా పీటీఐ (PTI) నేతలపై రెండు కేసులు నమోదు చేశారు. అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ కార్యాలయం, ఓ కంటైనర్ పై దాడి చేసి, తగలబెట్టారన్న ఆరోపణలపై లాహోర్ పోలీసులు మే 10వ తేదీన ఇమ్రాన్ సహా పీటీఐ నాయకులపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో విచారణ జరిపిన లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు (Anti-Terrorism Court) న్యాయమూర్తి అబెర్ గుల్ ఖాన్ ఇమ్రాన్ తో పాటు మరో ఆరుగురు పార్టీ నేతలపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. ‘రెండు దహన దాడుల కేసుల్లో పీటీఐ చీఫ్ ఇమ్రాన్ తో పాటు ఆయన పార్టీకి చెందిన మరో ఆరుగురు నేతలను అరెస్ట్ చేసేందుకు లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు (ఏటీసీ) న్యాయమూర్తి అబేర్ గుల్ ఖాన్ మంగళవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు’ అని కోర్టు అధికారి ఒకరు తెలిపారు.
ఇమ్రాన్ తోపాటు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన వారిలో.. పీటీఐ నేతలు హసన్ నియాజీ, అహ్మద్ అజార్, మురాద్ సయూద్, జంషెడ్ ఇక్బాల్ చీమా, ముసరత్ చీమా, మియాన్ అస్లాం ఇక్బాల్ ఉన్నారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు.
Also Read..
Uber LayOff | లేఆఫ్స్ ప్రకటించిన ఉబర్.. ఆ 200 మందిని తొలగించనున్న సంస్థ
Kerala | విడాకులపై కోర్టు తీర్పుతో అసంతృప్తి.. జడ్జి కారు ధ్వంసం చేసిన భర్త
Varun-Lavanya | లావణ్య ఫోన్ వాల్ పిక్లో వరుణ్ ఫొటో.. షేర్ చేసిన కాబోయే మెగా కోడలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

