Uber LayOff | లేఆఫ్స్ ప్రకటించిన ఉబర్.. ఆ 200 మందిని తొలగించనున్న సంస్థ
Uber LayOff | ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ (Uber) కూడా లేఆఫ్స్ (LayOff) జాబితాలో చేరింది. సంస్థలో ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది.
Uber LayOff | ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, గూగుల్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగుల్ని తీసేశాయి (LayOff). ఆదాయం తగ్గడంతో ఖర్చు తగ్గింపులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెబుతున్నాయి. మరికొన్ని కంపెనీలు కూడా అదేబాటలో పయనిస్తున్నాయి. విడతల వారీగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి.
తాజాగా ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ (Uber) కూడా లేఆఫ్స్ (LayOff) జాబితాలో చేరింది. సంస్థలో ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. రిక్రూట్ మెంట్ విభాగంలో (recruitment division) 200 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 32,700 మంది ఉద్యోగుల్ని కలిగి ఉన్న ఉబర్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో రవాణా సేవల విభాగం నుంచి 150 మందిని తొలగించింది. ఇది తన గ్లోబర్ వర్క్ ఫోర్సులో 1 శాతంగా ఉంది. తాజాగా రిక్రూట్ మెంట్ విభాగంలో 35 శాతం కోత పెట్టింది. కాగా, 2020 మధ్యలో మహమ్మారి ప్రారంభంలో ఉబర్ తన సిబ్బంది సంఖ్యను 17 శాతం తగ్గించింది.
Also Read..
Varun-Lavanya | లావణ్య ఫోన్ వాల్ పిక్‌లో వరుణ్ ఫొటో.. షేర్ చేసిన కాబోయే మెగా కోడలు
Kerala | విడాకులపై కోర్టు తీర్పుతో అసంతృప్తి.. జడ్జి కారు ధ్వంసం చేసిన భర్త
Assam Floods | అస్సాంను ముంచెత్తిన వరదలు.. చిక్కుకున్న 1.20 లక్షల మంది
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

