శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 13:43:02

కంటైన్‌మెంట్ జోన్ల వద్ద 200 మొబైల్ ల్యాబ్స్

కంటైన్‌మెంట్ జోన్ల వద్ద 200 మొబైల్ ల్యాబ్స్

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో కరోనా నియంత్రణకు గ్రేటర్ బెంగళూరు నగరపాలిక మండలి అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. నగరంలోని కంటైన్‌మెంట్ జోన్లు, హాట్‌స్పాట్ ప్రాంతాల్లో కరోనా పరీక్షల కోసం 200 మొబైల్ ల్యాబ్స్ ఏర్పాటు చేసింది. ఆయా ప్రాంతాల్లోని వారికి యంటీజెన్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నది.

కర్ణాటకలో 51 వేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా చనిపోయారు. ఒక్క బెంగళూరు నగరంలోనే సగానికి పైగా కేసులు, మరణాలు నమోదయ్యాయి. శుక్రవారం నాటికి బెంగళూరులో కరోనా కేసుల సంఖ్య 25 వేలను దాటగా 500 మందికిపైగా మరణించారు.

ఈ నేపథ్యంలో బెంగళూరును కరోనా రహితంగా చేద్దాం అన్న నినాదంతో బీబీఎంపీ మొబైల్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. నగరంలో కరోనా తీవ్రత పెరుగుతుంటే ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇండ్ల నుంచి బయటకు వచ్చి అనవసరంగా తిరుగుతున్నారని మేయర్ గౌతం కుమార్ విమర్శించారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో లాక్‌డౌన్‌ను మరో వారం రోజులపాటు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నదని ఆయన చెప్పారు.
logo