Reserve Day: ఇండోపాక్ మ్యాచ్‌కు రిజర్వ్ డే.. ఓకే చెప్పిన బంగ్లా, లంక క్రికెట్ బోర్డులు
Reserve Day: ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆసియాకప్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ప్రకటించడాన్ని బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ బోర్డులు స్వాగతించాయి. ఆ హైవోల్టేజీ మ్యాచ్‌పై అన్ని జట్ల అభిప్రాయాల్ని తీసుకుని రిజర్వ్ డేను కేటాయించినట్లు వెల్లడించాయి. బంగ్లా, లంక బోర్డులు తమ ట్విట్టర్లో ఈ విషయాన్ని చెప్పాయి.
కొలంబో: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం జరుగనున్న భారత్, పాకిస్థాన్ సూపర్-4 మ్యాచ్‌కు రిజర్వ్ డే (Reserve Day)కేటాయించినట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వెల్లడించిన విషయం తెలిసిందే.. టోర్నీలో భాగంగా ఈ నెల 4న భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈసారి అలా జరగకూడదనే ముందు జాగ్రత్తగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై తొలుత శ్రీలంక, బంగ్లాదేశ్ కోచ్‌లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ మళ్లీ శుక్రవారం రాత్రి రెండు క్రికెట్ బోర్డులు ప్రకటన చేశాయి. అన్ని జట్లతో చర్చలు జరిపిన తర్వాతే ఇండోపాక్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయించినట్లు ప్రకటించాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్ని తెలిపింది. శ్రీలంక క్రికెట్ బోర్డు ఇదే విషయాన్ని తన ట్విట్టర్లో వెల్లడించింది.
A reserve day for India Pakistan contest in Super 11 Asia Cup Super 4 stage has been added that effectively revised the Asia Cup playing condition. To clarify on the position, the decision was taken with the consent of all four participating teams and ACC.
— Bangladesh Cricket (@BCBtigers) September 8, 2023
ఇతర మ్యాచ్‌లకు కాకుండా కేవలం ఈ ఒక్క పోరుకే రిజర్వ్ డే కేటాయించడం విమర్శలకు తావిచ్చినా.. తాము సరైన నిర్ణయమే తీసుకున్నామని ఏసీసీ ప్రకటించింది. దాయాదుల మధ్య సమరానికి ఈసారి కూడా వరుణుడు అడ్డుపడితే.. మ్యాచ్ ఆగిన చోటు నుంచి మరుసటి రోజు ఆట కొనసాగించనున్నట్లు ఏసీసీ వెల్లడించిన విషయం తెలిసిందే. అంటే ఒకవేళ ఆదివారం మ్యాచ్ ఎక్కడ ఆగిపోయినా.. ఆ మ్యాచ్ అక్కడి నుంచే సోమవారం రోజున ప్రారంభం అవుతుంది. ఒకవేళ ఆదివారం పూర్తిగా జరగకుంటే, దాన్ని సోమవారం నిర్వహిస్తారు.
The reserve day for the India-Pakistan contest of the Super 11 Asia Cup Super 4 stage was taken in consultation with all four member boards of the Super 4 competing teams.
Accordingly, the ACC effectively revised the playing conditions of the tournament to effect the agreed-upon…
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 8, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

