శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 05, 2020 , 09:34:23

కర్ణాటకలో కొనసాగుతున్న బంద్‌

కర్ణాటకలో కొనసాగుతున్న బంద్‌

బెంగళూరు : కర్ణాటకలో బంద్‌ కొనసాగుతోంది. సీఎం యడ్యూరప్ప నవంబర్‌ 14న ప్రకటించిన మరాఠా అభివృద్ధి అథారిటీ (ఎండీఎం) ఏర్పాటు, వారి అభివృద్ధి కోసం రూ.50కోట్లు కేటాయించడంపై కన్నడ అనుకూల సంస్థలు శనివారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎండీఏం ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బంద్‌ పాటిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేఎస్‌ఆర్‌ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌ నుంచి ఫ్రీడమ్‌ పార్క్‌ వరకు ర్యాలీ తీయనున్నారు.

అయితే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బస్సు సేవలు, మెట్రో సేవలు కొనసాగుతాయని, బంద్‌కు వెళ్లొద్దని సీఎం యడ్యూరప్ప వ్యక్తి చేశారు. కర్ణాటకతో సంబంధం ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. తాను కన్నడకు ప్రాముఖ్యతను ఇచ్చానని, వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇదిలా ఉండగా బంద్‌ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం భద్రతను పెంచింది. దుకాణాలు, వాణిజ్య సముదాయాలను బలవంతంగా మూసివేయకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటికే హోటళ్ల యజమానులు, ట్రావెల్‌ ఆపరేటర్లు బంద్‌ పాటించబోమని స్పష్టం చేశారు. పలు రవాణా సంఘాలు, ఆటో, ట్యాక్సీ యూనియన్లు మాత్రం బంద్‌కు సంఘీభావం ప్రకటించాయి. 


logo