Balcony Collapse | మధురలో కూలిన భవనం.. ఐదుగురు దుర్మరణం..
Balcony Collapse | ఉత్తరప్రదేశ్ మధురలోని బాంకే బిహారీ ఆలయ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. దుసాయిట్ ప్రాంతంలో మూడంతస్తుల పాత భవనం బాల్కని కూలి ఐదుగురు మృతి చెందారు. 12 మంది వరకు గాయపడ్డారని జిల్లా కలెక్టర్ పుల్కిత్ ఖరే తెలిపారు.
Balcony Collapse | ఉత్తరప్రదేశ్ మధురలోని బాంకే బిహారీ ఆలయ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. దుసాయిట్ ప్రాంతంలో మూడంతస్తుల పాత భవనం బాల్కని కూలి ఐదుగురు మృతి చెందారు. 12 మంది వరకు గాయపడ్డారని జిల్లా కలెక్టర్ పుల్కిత్ ఖరే తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బృందావన్‌లోని షౌ షయ ఆసుపత్రికి తరలించారు.
వర్షం కారణంగా మూడంతస్తుల భవనం బాల్కనీ కూలిపోయిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మృతుల కుటుంబాలకు నిబంధన ప్రకారం పరిహారం.. అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఘటనపై విచారణ జరిపిస్తామని, ఆ తర్వాత ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. గత కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయని, తడిసిపోవడంతో కూలిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారని, పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని చెప్పారు. సంఘటనా స్థలంలో కార్పొరేషన్ బృందం పరిశీలిస్తుందని, ఏదైనా భవనంలో ఏదైనా భాగం దెబ్బతిన్నట్లు గుర్తిస్తే దాన్ని సైతం కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా కూలిపోవడంతో హాహాకారాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.
VIDEO | A portion of an old building collapses near Banke Bihari Temple in Vrindavan. More details are awaited. pic.twitter.com/lRUd9H7GTr
— Press Trust of India (@PTI_News) August 15, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

