Youth Beaten To Death | గురుద్వారాలో అపవిత్రంగా ప్రవర్తించిన యువకుడు.. కొట్టి చంపిన జనం
Youth Beaten To Death | ఒక యువకుడు గురుద్వారాలో అపవిత్రంగా ప్రవర్తించాడు. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌లోని కొన్ని పేజీలను చించాడు. ఆగ్రహించిన సిక్కులు అతడ్ని కొట్టి చంపారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
చండీగఢ్: ఒక యువకుడు గురుద్వారాలో అపవిత్రంగా ప్రవర్తించాడు. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌లోని కొన్ని పేజీలను చించాడు. ఆగ్రహించిన సిక్కులు అతడ్ని కొట్టి చంపారు. (Youth Beaten To Death) పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం బండాలా గ్రామంలోని గురుద్వారా బాబా బీర్ సింగ్ వద్ద 19 ఏళ్ల బక్షీష్ సింగ్ అనుచితంగా ప్రవర్తించాడు. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌లోని కొన్ని పేజీలను చించివేశాడని స్థానికులు ఆరోపించారు. పారిపోతున్న అతడ్ని పట్టుకుని చేతులు కట్టేసి దారుణంగా కొట్టారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రక్తం కారుతున్న బక్షీష్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మరణించాడు. మరోవైపు తన కుమారుడు
మానసిక వికలాంగుడని, రెండేళ్లుగా మందులు వాడుతున్నాడని బక్షీష్ సింగ్ తండ్రి లఖ్వీందర్ సింగ్ పోలీసులకు చెప్పాడు. తన కుమారుడ్ని చంపిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

