Zeeshan Siddique | ముంబై : మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ను కొద్ది రోజుల క్రితం బిష్ణోయ్ గ్యాంగ్ అత్యంత దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. తాజాగా బాబా సిద్ధిక్ కుమారుడు జీషన్ సిద్ధిక్‌కి, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ బెదిరింపు కాల్స్ అక్టోబర్ 25వ తేదీన వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. జీషన్ సిద్ధిక్ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ సల్మాన్ ఖాన్‌ను హెచ్చరించారు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్‌కు అక్టోబర్ 17 రాత్రి మెసేజ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ నంబర్ ఎవరిది, మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కొనే పనిలో పడ్డారు. మళ్లీ తాజాగా బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.
జీషన్ సిద్ధిక్(Zeeshan Siddique).. అజిత్ పవార్‌కు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆగస్టులో జీషన్‌ను వెలివేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో ఆ చర్య తీసుకున్నది. ఇక త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బాంద్రా ఈస్ట్ నుంచి జీషన్ ఎన్సీపీ టికెట్‌పై పోటీ చేయనున్నారు. 2019 ఎన్నికల్లో ఆ స్థానం నుంచి వరుణ్ సర్దేశాయ్పై పోటీ చేసి గెలిచారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే మేనేల్లుడు వరుణ్‌పై ఆయన విజయం సాధించారు.
ఇవి కూడా చదవండి..
Kerala Festival: కేరళ ఉత్సవంలో పేలిన బాణాసంచా.. 150 మందికి గాయాలు
Kerala CM | కేరళ సీఎంకు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ.. VIDEO
Jammu and Kashmir: ఆక్నూర్ ఆపరేషన్‌లో ఇద్దరు మిలిటెంట్లు కాల్చివేత..