Ayodhya | రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అయోధ్య రైల్వే స్టేషన్ పేరు మార్పు
Ayodhya | అయోధ్య (Ayodhya)లో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్‌లోని రైల్వే స్టేషన్ (Ayodhya Train Station) పేరు మార్చింది.
Ayodhya | అయోధ్య (Ayodhya)లో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్‌లోని రైల్వే స్టేషన్ (Ayodhya Train Station) పేరు మార్చింది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’ (Ayodhya Dham junction)గా పేరు మార్చింది. రైల్వే స్టేషన్ పేరు మార్పు ప్రతిపాదనను యోగి సర్కార్ రైల్వే శాఖ ముందు ఉంచగా.. ఆ ప్రతిపాదనను రైల్వే శాఖ అంగీకరించింది. దీంతో అయోధ్య రైల్వే జంక్షన్ ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా మారింది.
యావత్తు భారతావని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ (UP) లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. దీంతో రామయ్యను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి అయోధ్య నగరానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన కేంద్ర ప్రభుత్వం.. అత్యాధునిక సదుపాయాలతో అయోధ్యలో రైల్వే స్టేషన్‌ను నిర్మించింది. ఈ రైల్వే స్టేషన్‌ను డిసెంబర్ 30న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు అయోధ్యలోని విమానాశ్రయాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు.
Also Read..
Sharad Pawar | రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు : శరద్ పవార్
Dense Fog | వణుకుతున్న ఉత్తరాది.. ఢిల్లీలో పొగమంచు కారణంగా 134 విమాన సర్వీసులకు అంతరాయం
Coronavirus | విజృంభిస్తున్న మహమ్మారి.. 700కు చేరువలో కరోనా కొత్త కేసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

