Air India | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా (Air India) విమాన ప్రమాదం అనంతరం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠిన చర్యలు చేపట్టింది. విమాన ప్రయాణాల్లో భద్రత, సిబ్బంది వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియాకు తాజాగా నాలుగు షోకాజు నోటీసులు జారీ చేసింది. క్యాబిన్ సిబ్బంది విశ్రాంతి, శిక్షణ నిబంధనలు, నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగినట్లు ఎయిరిండియా అంగీకరించినట్లు సమాచారం. భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి గత ఆరు నెలల్లో ఎయిరిండియాకు డీజీసీఏ తొమ్మిది షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ ఇటీవల రాజ్యసభకు తెలియజేసింది. ఉల్లంఘనలకు సంబంధించి తగిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
Also Read..
Free Trade Agreement | భారత్-యూకే మధ్య కీలక ట్రేడ్ డీల్.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు
Parliament Session | నాలుగోరోజూ సాగని చర్చ.. ఉభయ సభలు రేపటికి వాయిదా
MK Stalin | హృదయ స్పందన రేటులో తేడాలు.. సీఎం స్టాలిన్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల