Free Trade Agreement | భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Modi) యూకే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ లండన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య కీలక ట్రేడ్ డీల్ కుదిరింది. భారత్-యూకేల (India – UK) మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Deal)పై ఇరుదేశాలూ సంతకాలు చేశాయి. ప్రధాని మోదీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇదరుదేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
India and the UK sign the Comprehensive Economic and Trade Agreement in London, in the presence of Union Minister Piyush Goyal and UK Secretary of State for Business and Trade, Jonathan Reynolds.
(Pics: ANI/DD News) pic.twitter.com/jBaXH9OVnL
— ANI (@ANI) July 24, 2025
కాగా, భారత్-యూకేల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కోసం జరిపిన చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు మే 6న ప్రకటించిన విషయం తెలిసిందే. 2030 నాటికి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేదిగా ఈ ఒప్పందం ఉంది. తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని, బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందంలో పొందుపర్చారు. భారత్-యూకేల ఈ ఒప్పందంలో వస్తువులు, సేవలు, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కులు తదితర అంశాలను ఇందులో ప్రతిపాదించారు.
అంతకు ముందు యూకే పర్యటనపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన చాలా దోహదపడుతుందన్నారు. మన ప్రజలకు శ్రేయస్సు, వృద్ధి ఉద్యోగ సృష్టిని పెంచడంపై దృష్టి ఉంటుందని చెప్పారు. ప్రపంచ పురోగతికి బలమైన భారతదేశం-యూకే స్నేహం చాలా అవసరమని తెలిపారు. ఇక్కడి భారతీయ సమాజం నుంచి లభించిన హృదయపూర్వక స్వాగతం తనను కదిలించిందని వెల్లడించారు. భారతదేశ పురోగతి పట్ల వారి అభిమానం మక్కువ నిజంగా నా హృదయాన్ని తాకిందని ప్రధాని ట్వీట్ చేశారు.
Also Read..
Parliament Session | నాలుగోరోజూ సాగని చర్చ.. ఉభయ సభలు రేపటికి వాయిదా
MK Stalin | హృదయ స్పందన రేటులో తేడాలు.. సీఎం స్టాలిన్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల
Donald Trump: ఇండియన్ టెకీలను తీసుకోవద్దు.. గూగుల్, మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ ఆదేశాలు !