మంగళవారం 26 జనవరి 2021
National - Dec 24, 2020 , 15:39:36

క‌రోనా నుంచి కోలుకుంది.. కానీ శ‌ర‌రీమంతా చీము..

క‌రోనా నుంచి కోలుకుంది.. కానీ శ‌ర‌రీమంతా చీము..

ముంబై : ఓ మ‌హిళకు క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందింది. కొన్నాళ్ల‌కు ఆమె వైర‌స్ నుంచి కోలుకుని ఇంటికి వెళ్లింది. కానీ ఆమె శ‌రీర‌మంతా చీముతో నిండిపోయింది. దీంతో మూడుసార్లు ఆమెకు శ‌స్ర్త చికిత్స నిర్వ‌హించి చీమును తొల‌గించారు వైద్యులు. ఔరంగాబాద్‌లోని బ‌జాజ్ న‌గ‌ర్‌కు చెందిన ఓ మ‌హిళ‌కు క‌రోనా వైర‌స్ నుంచి కోలుకుని ఇంటికి చేరింది. కొద్ది రోజుల త‌ర్వాత‌ ఆమె వెన్నునొప్పితో పాటు న‌డుము నొప్పితో బాధ‌ప‌డుతోంది.

దీంతో ఆమె న‌వంబ‌ర్ 28న హెడ్గేవార్ ఆస్ప‌త్రికి వెళ్లింది. ఆ మ‌హిళ కాళ్లు కూడా వాచిపోయాయి. దీంతో బాధితురాలికి వైద్యులు ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వ‌హించ‌గా, మెడ భాగంతో పాటు వెన్ను భాగంలో చీము నిండిపోయిన‌ట్లు తేలింది. అంతే కాదు.. చేతులు, పొట్ట భాగంలో కూడా చీము ఉన్న‌ట్లు గుర్తించారు వైద్యులు.

ఆ త‌ర్వాత మూడు ప‌ర్యాయాలు వైద్యులు శ‌స్ర్త చికిత్స నిర్వ‌హించి హాఫ్ లీట‌ర్ చీమును తొల‌గించారు. అయితే శ‌రీరంలో ఏమైనా క‌ణితిలు ప‌గ‌ల‌డం వ‌ల్ల లేదా, ఫ్యాక్చ‌ర్ జ‌రిగినా ఇలా చీము ఏర్ప‌డుతుంద‌ని వైద్యులు పేర్కొన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు ఏడు మాత్ర‌మే న‌మోదు అయ్యాయి. భార‌త్‌లో ఇదే తొలి కేసు అని వైద్యులు తెలిపారు. డిసెంబ‌ర్ 21న మ‌హిళ‌ను ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేశారు.


logo