Atul Garg : లోక్సభలో నూతనంగా ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారాలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ వారిచేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. మంగళవారం బీజేపీ ఎంపీ (BJP MP) అతుల్ గార్గ్ (Atul Garg) తన ప్రమాణస్వీకారం సందర్భంగా వివాదాస్పద నినాదాలు చేశారు. దాంతో సభలోని విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అయినా అతుల్ గార్గ్ వారి అభ్యంతరాన్ని లెక్కచేయకుండా మళ్లీ నినదించారు.
#18thLokSabha: Atul Garg (BJP) takes oath as Member of Parliament LokSabha, (Ghaziabad, Uttar Pradesh)#LokSabha #RajyaSabha #parliamentsession @LokSabhaSectt @AtulGargBJP pic.twitter.com/a7c3DSgtJS
— Politicspedia (@Politicspedia23) June 25, 2024
ముందుగా ప్రమాణస్వీకారం చేసిన అతుల్ గార్గ్.. అది ముగియగానే ‘శ్యామ ప్రసాద్ ముఖర్జి జిందాబాద్, దీన్దయాల్ ఉపాధ్యాయ జిందాబాద్, అటల్ బిహారీ వాజ్పేయి జిందాబాద్, నరేంద్రమోదీ జిందాబాద్’ అని నినదించారు. దాంతో విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. అవేం నినాదాలు అంటూ గోల చేశారు. దాంతో మళ్లీ మైక్ దగ్గరికి తిరిగి వెళ్లిన గార్గ్.. ‘డాక్టర్ హెడ్గెవార్ జిందాబాద్’ అని నినదించి కిందకు వచ్చారు. డాక్టర్జీ గా ప్రసిద్ధి చెందిన హెడ్గెవార్ ఆరెస్సెస్ను స్థాపించారు.