న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల బిల్లును అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో కేంద్రం ఆ బిల్లుపై ప్రజలు, ఎంపీలు, రాజకీయ నాయకుల్లో నెలకొన్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసేందుకు తరచూ అడిగే ప్రశ్నల విధానంలో కొన్ని వివరాలను ఆదివారం విడుదల చేసింది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై తన విధానమేమిటో వెల్లడించేందుకు ప్రయత్నించింది. మహిళా బిల్లులో సమగ్రత లేదని విమర్శలు రావడం.. హడావిడిగా దాన్ని అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎన్డీయే ప్రభుత్వం ఈ దిద్దుబాటు చర్యకు ప్రయత్నించినట్టు అనిపిస్తున్నది! కేంద్రం విడుదల చేసిన ప్రకటనలోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
జవాబు: పునర్విభజన అంటే అర్థం నియోజకవర్గాల సరిహద్దులను అంతిమంగా నిర్ధారించడం. మహిళల రిజర్వేషన్లకు అది చాలా అవసరం. నేడు దేశ జనాభా 140 కోట్లకు చేరుకుంది. దీంతో లోక్సభ సీట్లను 850కి పెంచడం చాలా ముఖ్యం. అది పార్లమెంట్లో ప్రజలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడానికి వీలు కల్పిస్తుంది.
జవాబు: డీలిమిటేషన్ చట్టాన్ని మార్చే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదు. కమిషన్ చేసే సిఫార్సులకు పార్లమెంట్ ఆమోదం, రాష్ట్రపతి సమ్మతి అవసరం. ప్రస్తుత వ్యవస్థ ద్వారానే 2029 వరకు ఎన్నికలు నిర్వహిస్తారు కాబట్టి, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం ఉండదు.
జవాబు: ఈ ప్రతిపాదన దామాషా విస్తరణ విధానంపైనే ఆధార పడి ఉంది. దీని ప్రకారం ఏకరీతిన రాష్ర్టాలు, యూటీల్లో 50 శాతం సీట్ల సంఖ్య పెరుగుతుంది. దీనిని ప్రస్తుతమున్న 543 లోక్సభ సీట్లకు వర్తింప చేస్తే వాటి సంఖ్య సుమారు 815కు పెరుగుతుంది. ప్రస్తుతమున్న గరిష్ఠ సంఖ్య పరిమితి 550 సీట్లను దాటి 850కు చేరుతుంది.
జ: లేదు. అన్ని రాష్ర్టాల్లోనూ ఏకరీతిన 50 సీట్ల పెంపు జరుగుతుంది. దీంతో దక్షిణాది రాష్ర్టాల ప్రాతినిధ్యంలో ఎలాంటి తేడా రాదు. అంతేకాకుండా వారి ప్రాతినిధ్య నిష్పత్తి స్థిరంగా ఉంటుంది. ప్రస్తుతం దక్షిణాది రాష్ర్టాలకు లోక్సభ సీట్లలో 23.76 శాతం వాటా ఉంది. పెంచిన తర్వాత వారి ప్రాతినిధ్యం 23.87 శాతం అవుతుంది. తెలంగాణలో 17 నుంచి 26కు, ఏపీలో 25 నుంచి 38కి, కర్ణాటకలో 28 నుంచి 42కు ఎంపీ సీట్లు పెరుగుతాయి. దక్షిణాది రాష్ర్టాల్లో ప్రస్తుతమున్న 129 సీట్ల సంఖ్య 195కు పెరుగుతుంది.