లక్నో, జూలై 29: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. మధ్యప్రదేశ్లో దళితులు, గిరిజనులపై వరుసగా జరుగుతున్న అకృత్యాలను మరువకముందే… యూపీలో మరో ఘటన బయటపడింది. ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనానికి కట్టేసి అతి క్రూరంగా లాక్కెళ్లిన ఘటన బరేలీలో చోటుచేసుకుంది. బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
ద్విచక్రవాహనంపై కూర్చున్న ముగ్గురు వ్యక్తులు… ఓ వ్యక్తిని ఆ బండికి కట్టేసి అతన్ని వందల మీటర్లు లాక్కెళ్లారు. బాధితుడు విలవిల్లాడుతున్నా వారు కనికరించలేదు. బాధితుడు ఆర్తనాదాలు చేస్తున్నప్పటికీ స్థానికులు వారిని అడ్డుకోలేదు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.