Atishi Marlena | బీజేపీలో చేరతావా? అరెస్టు అవుతావా ?.. ఓ వ్యక్తి ద్వారా కమలం పార్టీ సంప్రదించిందన్న ఢిల్లీ మంత్రి ఆతిశీ
ఆప్ కీలక నాయకురాలు, ఢిల్లీ మంత్రి ఆతిశీ సంచలన విషయాలు బయటపెట్టారు. బీజేపీలో చేరకపోతే నెల రోజుల్లో ఈడీ ద్వారా అరెస్టు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఓ వ్యక్తి ద్వారా బీజేపీ తనకు చెప్పించిందని ఆమె తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... త్వరలో తన ఇల్లు, తన సన్నిహితుల ఇండ్లలో ఈడీ సోదాలు చేపట్టబోతున్నదని, ఆ తర్వాత తనకు సమన్లు పంపించి అరెస్టు చేస్తుందని ఆమె పేర్కొన్నారు.
- నన్ను ప్రలోభ పెట్టాలని ఓ వ్యక్తి ద్వారా బీజేపీ సంప్రదించింది
- నాతో సహా నలుగురు ఆప్ నాయకులను అరెస్టు చేస్తారు
- ఢిల్లీ రాష్ట్ర మంత్రి ఆతిశీ సంచలన వ్యాఖ్యలు
Atishi Marlena | న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఆప్ కీలక నాయకురాలు, ఢిల్లీ మంత్రి ఆతిశీ సంచలన విషయాలు బయటపెట్టారు. బీజేపీలో చేరకపోతే నెల రోజుల్లో ఈడీ ద్వారా అరెస్టు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఓ వ్యక్తి ద్వారా బీజేపీ తనకు చెప్పించిందని ఆమె తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… త్వరలో తన ఇల్లు, తన సన్నిహితుల ఇండ్లలో ఈడీ సోదాలు చేపట్టబోతున్నదని, ఆ తర్వాత తనకు సమన్లు పంపించి అరెస్టు చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ‘నాకు సన్నిహితుడైన ఒక వ్యక్తి ద్వారా బీజేపీ నన్ను సంప్రదించింది. నా రాజకీయ జీవితం కాపాడుకునేందుకు బీజేపీలో చేరాలని, లేకపోతే నెల రోజుల్లో అరెస్టు అవుతావని చెప్పించింది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్‌ను అరెస్టు చేసిన తర్వాత ఆప్ విచ్ఛిన్నం అవుతుందని బీజేపీ ఆశించింది. కానీ అలా జరగకపోవడంతో తర్వాత కీలక నాయకులుగా ఉన్న నాతో పాటు సౌరభ్ భరద్వాజ్, రాఘవ్ చద్ధా, దుర్గేశ్ పాఠక్‌ను అరెస్టు చేయించబోతున్నది’ అని ఆమె పేర్కొన్నారు.‘మేము కేజ్రీవాల్ సైనికులం. భగత్ సింగ్ శిష్యులం. మీ బెదిరింపులకు భయపడబోమని బీజేపీకి చెప్పదలుచుకున్నా. దేశాన్ని రక్షించేందుకు, ప్రజల అభ్యున్నతికి ఆప్ చివరి కార్యకర్త వరకు పోరాడతారు’ అని ఆమె స్పష్టం చేశారు.
కేజ్రీవాల్ రాజీనామా చేయరు
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయబోరని ఆతిశీ మరోసారి స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌పై నేరం నిరూపణ కాలేదని, చార్జ్‌షీట్ కూడా దాఖలు చేయలేదని ఆమె గుర్తు చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కి పూర్తి మెజారిటీ ఉందని, కాబట్టి కేజ్రీవాల్ రాజీనామా చేయాడానికి ఎలాంటి కారణం లేదని ఆమె పేర్కొన్నారు. మరోవైపు, ఆప్‌కి చెందిన 55 మంది ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. కేజ్రీవాల్ రాజీనామా చేయొద్దని, జైలు నుంచే ఆయన ప్రభుత్వాన్ని నడిపించాలని ఎమ్మెల్యేలు ఆమెను కోరారు.
జైలులో సీఎం ఆఫీసు కోసం కోర్టుకు ఆప్!
తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కార్యాలయంగా వినియోగించుకునేందుకు జైలు ఆవరణలో చిన్న స్థలం కేటాయించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాలని ఆప్ భావిస్తున్నది. ఈ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ సహా ముఖ్యమైన సదుపాయాలు కల్పించాలని కోరనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

