Elephant | కేరళ రాష్ట్రంలో నిర్వహించిన ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవాల కోసం తీసుకొచ్చిన ఏనుగుల్లో (Elephant) ఒకటి జనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 12:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మలప్పురం (Malappuram)లోని బీపీ అంగడి వద్ద మంగళవారం రాత్రి వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఏనుగులను తీసుకొచ్చారు. ఉత్సవాలు జరుగుతుండగా.. ఉన్నట్టుండి ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. పెద్ద పెద్దగా శబ్ధాలు చేస్తూ.. జనాల్లోకి దూసుకెళ్లింది. ఓ వ్యక్తిని తొండంతో ఎత్తి పక్కకు పడేసింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ప్రస్తుతం అతడికి కొట్టకల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కాగా, ఏనుగు ఒక్కసారిగా బీభత్సం సృష్టించడంతో జాతరకు వచ్చిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏనుగు దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు 17 మందికిపైగా గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని ఏనుగును బంధించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
#WATCH | Malappuram, Kerala: Many people were injured when an elephant turned violent during Puthiyangadi annual ‘nercha’ at BP Angadi, Tirur
(Source: Taluk Disaster Response Force) pic.twitter.com/jlm7tCGTxf
— ANI (@ANI) January 8, 2025
Also Read..
Kerala High Court: మహిళల శరీరంపై కామెంట్ చేసినా.. లైంగిక వేధింపే అవుతుంది: కేరళ హైకోర్టు
Delhi Metro | ఢిల్లీ మెట్రోలో సీటు కోసం గొడవ.. జుట్లు పట్టుకుని తలపడ్డ మహిళలు.. VIDEO
Nitin Gadkari | రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స.. కీలక పథకాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి