శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 06, 2020 , 01:21:08

భూమిపైకి ఉల్క మట్టి

భూమిపైకి ఉల్క మట్టి

టోక్యో: మానవ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఓ ఉల్కపై నుంచి మట్టి నమూనాలు ఆదివారం భూమిని చేరనున్నాయి. జపాన్‌ ప్రయోగించిన హయబుసా 2 అంతరిక్ష నౌక రైగు ఉల్క నుంచి నమూనాలను సేకరించి భూమివైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఉల్క మట్టి నమూనాలున్న క్యాప్సూల్‌ ఆదివారం ఆస్ట్రేలియాలోని వూమెరా ప్రాంతంలో భూమిపై దిగనున్నది