Kolkata Violence | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా వీధులు యుద్ధ రంగాన్ని తలపించాయి. అవినీతి అంశంపై బెంగాల్ సచివాలయం రైటర్స్ బిల్డింగ్ వద్ద మంగళవారం నిరసనకు దిగిన బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌పై మూక దాడికి పాల్పడ్డారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌పై దాడి చేస్తున్న దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
బీజేపీ మద్దతుదారుల్ని నిలువరించేందుకు భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. నీటి ఫిరంగులు ప్రయోగించారు. కానీ, బ్యాట్లు, వెదురు కర్రలతో పోలీసులపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఒక పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలో కోల్‌కతా బీజేపీ, మున్సిపల్ కార్పొరేటర్, పోలీసులు, పలువురు బీజేపీ కార్యకర్తలు గాయ పడ్డారు. పోలీస్ కియోస్కీని బీజేపీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. పీసీఆర్ వ్యాన్‌ను పోలీసులే తగలబెట్టారని, తమ పార్టీ మద్దతుదారులను బద్నాం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకంతా మజుందార్ ఆరోపించారు. కానీ సుకంతా మజుందార్ ఆరోపణలు నగర పోలీసు సీనియర్ అధికారులు తోసిపుచ్చారు.
Massive protest broke out in #Kolkata MG road during a protest rally held by #BJP. Police vehicles tourched, Asst Police Commissioner was also attacked with sticks brutally by a violent mob.
Surprisingly no teargas shell or police firing is reported yetpic.twitter.com/rv0nvoeDZp— Saba Khan (@ItsKhan_Saba) September 13, 2022