PM Modi | దేశంలో ఎంపీల ఆస్తులు భారీగా పెరిగాయి. అదే సమయంలో గత పదేండ్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆస్తులు కూడా దాదాపు 80 శాతం పెరిగింది. ఈ మేరకు ఏడీఆర్ (Association for Democratic Reforms) నివేదిక వెల్లడించింది. సదరు నివేదిక ప్రకారం..
2014లో ఎంపీగా పోటీ చేసిన సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. ప్రధాని తన ఆస్తుల విలువ రూ.1.65 కోట్లుగా ప్రకటించారు. అయితే, ఈ పదేండ్లలో మోదీ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. దాదాపు 80 శాతం వృద్ధి కనిపించింది. ప్రస్తుతం ప్రధాని ఆస్తుల విలువ రూ.3,02,06889కు చేరింది. ప్రధానంగా ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ నిల్వల రూపంలోనే ఈ ఆస్తులు ఉన్నాయి. ఇక ప్రధానికి సొంతంగా కారు గానీ, ఇతర స్థిరాస్తులు గానీ లేవు. ఈ పదేండ్లలో మోదీ ఆస్తుల్లో వృద్ధి నమోదైనప్పటికీ దేశంలోని ఎంపీలతో పోలిస్తే పూరెస్ట్ పర్సన్ కావడం గమనార్హం.
అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తుల్లో కూడా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో రాహుల్ ఆస్తుల విలువ రూ.9.4 కోట్లుగా ఉంది. 2024 నాటికి అది రూ.20.39 కోట్లకు పెరిగింది. ఈ పదేండ్ల కాలంలో ఆయన సంపద దాదాపు 117 శాతం వృద్ధి చెందింది. రాహుల్ గాంధీ పెట్టుబడులు ప్రధానంగా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ మరియు స్థిరాస్తుల రూపంలో ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఇక దేశంలో పదేండ్ల పాటు ఎంపీలుగా కొనసాగుతన్న వారి ఆస్తులు సుమారు 110 శాతం మేర పెరిగినట్లు సదరు నివేదిక పేర్కొంది. ఎంపీల సందప వృద్ధిపై ఏడీఆర్ నివేదిక ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
Also Read..
Elephant | ఏనుగు బీభత్సం.. రెండు రోజుల్లో 13 మంది మృతి
Madhav Gadgil | ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత
Donald Trump | రష్యా చమురుపై ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. భారత్‌పై 500 శాతం సుంకాలు..!