Chenab Bridge | కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (worlds highest rail bridge) చీనాబ్ రైల్వే వంతెనకు (Chenab Rail Bridge) సంబంధించిన ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని చూపించే వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘హెలికాఫ్టర్ షాట్- చీనాబ్ బ్రిడ్జ్’ అంటూ ఆయన షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
చీనాబ్ రైలు వంతెనను భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంతెన జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూ డివిజన్ రియాసి జిల్లా బక్కల్ – కౌరీ మధ్య ఉంది. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్ నదిపై 1,315 మీడర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిసాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ఇక పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తైంది. ఈ చారిత్రక వంతెనపై ఈ ఏడాది జూన్ 20న తొలి రైలు ట్రయల్ రన్‌ను కూడా విజయవంతంగా నిర్వహించారు. తద్వారా కశ్మీర్‌లోని రియాసి నుండి బారాముల్లా వరకు రైలు సేవల ప్రారంభానికి మార్గం సుగమం చేశారు.
Helicopter shot 🎥 – Chenab bridge pic.twitter.com/IGkJ3uZM7u
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 26, 2024
Also Read..
Saif Ali Khan | ఆయన ధైర్యవంతుడైన నిజాయితీ గల రాజకీయ నాయకుడు.. రాహుల్‌పై సైఫ్ అలీఖాన్ ప్రశంసలు
UNSC | భారత్‌కు బిగ్ బూస్ట్.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంకై యూకే మద్దతు
Reliance Foundation | తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం