Railway Minister : 58 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం ఒక కిలోమీటర్ ట్రాక్‌కు కూడా వారు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) నెలకొల్పలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ అన్నారు. ప్రయాణీకుల భద్రతను గాలికొదిలేసిన వారు ఇప్పుడు సభలో అరుపులతో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అశ్వనీ వైష్ణవ్ గురువారం లోక్‌సభలో మాట్లాడుతూ విపక్ష సభ్యుల తీరును ఎండగట్టారు.
మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా పనిచేసిన సమయంలో రైలు ప్రమాదాలు 0.24 శాతం నుంచి 0.19 శాతానికి తగ్గాయని చెప్పగానే బల్లలు చరిచారని, తాము రైలు ప్రమాదాలను 0.19 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గించినా తమను నిందిస్తున్నారని, ఈ రకంగా దేశాన్ని నడపగలమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తన ట్రోల్ ఆర్మీతో తప్పుడు విషయాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ తన దుష్ప్రచారంతో రైల్వేల్లో ప్రతిరోజూ ప్రయాణించే 2 కోట్ల మంది ప్రజల గుండెల్లో గుబులు రేపుతోందని, ప్రయాణీకులను భయపెట్టడమే ఆ పార్టీ ఉద్దేశమా అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రశ్నించారు. రైళ్లలో మూడింట రెండు వంతుల నాన్ ఏసీ కోచ్‌లు, మూడోవంతు ఏసీ కోచ్‌లు ఉంటాయని, జనరల్ కోచ్‌లకు పెరిగిన డిమాండ్ దృష్ట్యా ప్రతి మెయిల్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో కనీసం 4 జనరల్ కోచ్‌లు ఉండేలా చూస్తామని చెప్పారు. ఇందుకోసం 2500 జనరల్ కోచ్‌లు త్వరలో సిద్ధమవుతాయని మంత్రి తెలిపారు.
Read More :
Manda Krishna Madiga | 20 ఏండ్ల పోరాటానికి దక్కిన ఫలితం: మంద కృష్ణ