భువనేశ్వర్: సొంత కృత్రిమ మేధ(ఏఐ) మాడల్ అభివృద్ధికి భారత్ చేరువలో ఉన్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. భువనేశ్వర్‌లో ‘ఉత్కర్ష్ ఒడిశా’ సమావేశంలో బుధవారం ఆయన ప్రసంగించారు.
ఏఐ మాడల్ అభివృద్ధి కోసం ఆరు సంస్థలు ప్రధానంగా పని చేస్తున్నాయని మరో 4 నుంచి 10 నెలల్లో చాట్‌జీపీటీ, డీప్‌సీక్ లాంటి ఏఐ మాడల్ అభివృద్ధి అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఏఐ మాడల్ అభివృద్ధి కోసం గత ఏడాదిన్నరగా అంకుర సంస్థలు, పరిశోధకులు, తమ బృందాలు పని చేస్తున్నాయని అన్నారు.