(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఏప్రిల్ 8: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆశా వర్కర్లు, ఉషా వర్కర్లు రోడ్డెక్కారు. గత 20 రోజులుగా సాగుతున్న వారి ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ఆశా వర్కర్లు, ఉషా వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా మహా ర్యాలీలు నిర్వహించి, అధికార పార్టీ నాయకులను ఘెరావ్ చేశారు.
గౌరవ వేతనాలను పెంచుతామని, ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తామని 2021లో బీజేపి ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారని, వాటిని ఇంత వరకు అమలు చేయలేదని మహిళలు ఆరోపించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టంచేశారు.
గ్రామాల్లో మహిళల ఆరోగ్య రక్షణ కోసం నిర్విరామంగా ఆశా కార్యకర్తలు పనిచేస్తారు. కరోనా కాలంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశాం. కష్ట కాలంలో పనిచేసిన మమ్మల్ని కేవలం మాటలతో మురిపించారు తప్ప, ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఎన్నో ఏండ్ల నుంచి డిమాండ్ చేస్తున్నా గౌరవ వేతనంలో చిల్లిగవ్వ కూడా పెంచటం లేదు. మాకు కనీస కూలీ కూడా చెల్లించటం లేదు.
– కుసుమ్, ఆశా కార్యకర్త, భిండ్ గ్రామం