Arvind Kejriwal | ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన ఐదు ప్రశ్నలు సంధించారు. ఈడీ, సీబీఐతో బెదిరింపులకు దిగుతూ ఇతర పార్టీల నేతలపై విరుచుకుపడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలుస్తున్నారని.. ఎన్నికల ప్రభుత్వాలను పడగొట్టడం దేశానికి, ప్రజాస్వామ్యానికి మంచిదేనా. అంటూ ప్రశ్నించారు. తాను రాజకీయ పార్టీ నేతగా లేఖ రాడం లేదని.. సాధారణ పౌరుడిగా రాస్తున్నట్లు తెలిపారు. దేశ పరిస్థితిపై తాను ఆందోళన చెందుతున్నానన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని, దేశ రాజకీయాలను ఏ దిశగా తీసుకెళ్తున్నది.. అది యావత్ దేశానికి హానికరమని.. ఇలాగే కొనసాగితే మన ప్రజాస్వామ్యం, దేశం అంతమవుతుందన్నారు. పార్టీలు వస్తాయి.. పోతుంటాయని.. నాయకులు వస్తుంటారు.. పోతుంటారని.. కానీ, భారతదేశం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ దేశ త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడూ సగర్వంగా ఎగురవేయడం మన బాధ్యత అన్నారు.