Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Delhi Liquor Policy Case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రెగ్యులర్ బెయిల్ కోసం (regular bail plea) రౌస్ అవెన్యూ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, అంతకుముందు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. తన మధ్యంతర బెయిల్ పొడగింపు పిటిషన్‌ను అత్యవసరంగా లిస్టింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది.
కాగా, లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం మే 10న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూ 1 వరకూ బెయిల్ మంజూరు చేసింది. ఇక జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది.
అయితే, తీవ్రమైన అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో 7 రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా లిస్టింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. రెగ్యులర్ బెయిలు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చిందని, అందువల్ల ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని వివరించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.
Also Read..
UK Parliament | సార్వత్రిక ఎన్నికలు.. బ్రిటన్ పార్లమెంట్ రద్దు
Rishi Sunak | నేను ఎక్కడికీ వెళ్లట్లేదు.. బ్రిటన్ నా ఇల్లు : రిషి సునాక్
Rajinikanth | హిమాలయాల బాటపట్టిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్