Rajinikanth | హిమాలయాల బాటపట్టిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్
Rajinikanth | సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) మరోసారి హిమాలయాల బాటపట్టారు. ఈ సందర్భంగా డెహ్రాడూన్ ఎయిర్‌పోర్ట్‌లో తన ఆధ్యాత్మిక యాత్ర గురించి మాట్లాడారు.
Rajinikanth | సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth)లో ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన మాటల్లో కూడా తాత్వికత కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం ఆయన ఏటా హిమాలయాలను (Himalayas) సందర్శిస్తుంటారు. అక్కడి సుందరమైన ప్రకృతిలో కొద్ది రోజులు గడుపుతారు. తన సినిమాల విడుదలకు ముందు హిమాలయా యాత్ర చేయడం రజనీకాంత్ ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇక తాజాగా మరోసారి హిమాలయాల బాటపట్టారు ఈ సౌత్ సూపర్ స్టార్.
యాత్రలో భాగంగా చెన్నై నుంచి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా డెహ్రాడూన్ ఎయిర్‌పోర్ట్‌లో తన ఆధ్యాత్మిక యాత్ర గురించి మాట్లాడారు. ‘ఆధ్యాత్మిక యాత్ర చాలా ముఖ్యం. ఏటా నేను హిమాలయాలకు వెళ్తుంటా. వెళ్లిన ప్రతిసారీ కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ సారి కూడా కొత్త అనుభవాలు పొందుతానని నేను నమ్ముతున్నాను’ అని రజనీకాంత్ అన్నారు. ప్రపంచమంతటా ఆధ్యాత్మికత భావం అవసరమని ఈ సందర్భంగా సూపర్ స్టార్ అన్నారు. ఆధ్యాత్మికత అంటే శాంతి, ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసమని పేర్కొన్నారు. చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రినాథ్, కేదార్నాథ్ ఆలయాలను సందర్శించనున్నట్లు చెప్పారు.
ఇక సినిమాల విషయానికొస్తే రజనీకాంత్ ప్రస్తుతం కూలీ (Coolie), వెట్టయాన్ (Vettaiyan) చిత్రాల్లో నటిస్తున్నారు. తలైవా 170గా వస్తోన్న వెట్టయాన్ చిత్రానికి జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. దుషారా విజయన్, రితికా సింగ్ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి, దుషారా విజయన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. Vettaiyan ఈ ఏడాది అక్టోబర్‌లో థియేటర్లలో సందడి చేయనుండగా.. విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక కూలీ విషయానికొస్తే.. తలైవా 171 (Thalaivar171) గా తెరకెక్కుతున్న ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రజినీకాంత్ స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్టు టైటిల్ టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు.
Also Read..
Rishi Sunak | నేను ఎక్కడికీ వెళ్లట్లేదు.. బ్రిటన్ నా ఇల్లు : రిషి సునాక్
Fire | నోయిడాలోని సొసైటీ భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
Road Accident | పాల ప్యాకెట్ కోసం కుమారుడితో కలిసివెళ్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

