Loksabha Elections 2024 | విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశంలో పేదలందరికీ 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందచేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. తమ పది గ్యారంటీల్లో మొదటి గ్యారంటీ దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్ సరఫరాయేనని వివరించారు. దేశంలో 3 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నా మనం కేవలం 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌నే ఉపయోగించుకుంటున్నామని కేజ్రీవాల్ చెప్పారు.
దేశమంతటా పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తామని, ఇందుకు రూ. 1.25 లక్షల కోట్ల వ్యయమవుతుందని, ఈ నిధులను తాము సర్దుబాటు చేస్తామని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఇక సైనిక నియామకాల కోసం చేపట్టిన అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
చైనా ఆక్రమించిన మన భూభాగాన్ని డ్రాగన్ చెర నుంచి విడిపిస్తామని భరోసా ఇచ్చారు. సైనిక. దౌత్యపరమైన చర్యలతో ఈ దిశగా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ 75 ఏండ్ల తర్వాత రిటైర్ అయితే ఆయన స్ధానంలో తదుపరి ప్రధాని ఎవరని కేజ్రీవాల్ లేవనెత్తిన ప్రశ్నపై హాట్ డిబేట్ సాగుతోంది. 75 ఏండ్ల తర్వాత కూడా మోదీనే ప్రధానిగా కొనసాగుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల వివరణ ఇచ్చారు.
Read More :