భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షోలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో ఈరోజు ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిన కేజ్రీవాల్ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే నాటికి తాను జైల్లో ఉంటానో..బయట ఉంటానో తనకు తెలియదని వ్యాఖ్యానించారు.
అయితే తనకు జైలంటే భయం లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. సింగ్రౌలిలో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్‌ను ఆదరించిన తరహాలోనే మధ్యప్రదేశ్‌లోనూ తమ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే నాటికి తాను జైల్లో ఉంటానో..మరెక్కడ ఉంటానో తెలియదని, అయితే సింగ్రౌలికి కేజ్రీవాల్ వచ్చారు..తాము ఆయనకు చారిత్రక విజయం అందించామని ప్రతి ఒక్కరూ చాటిచెప్పాలని ఆయన పిలుపు ఇచ్చారు.
లిక్కర్ స్కామ్‌లో పలువురు ఆప్ నేతలు, మంత్రులపై కేంద్ర దర్యాప్తు సంస్ధలు తీవ్ర చర్యలు చేపట్టిన నేపధ్యంలో కేజ్రీవాల్ జైలు గురించి ప్రస్తావించారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇప్పటికే జైలులో ఉన్నారు.
Read More :
Pinarayi Vijayan | కేరళ సీఎంకు బెదిరింపులు.. చంపేస్తానంటూ ఫోన్ చేసిన 12 ఏళ్ల బాలుడు