Al Qaeda Terrorists | నలుగురు అల్‌ఖైదా ఉగ్రవాదులను (Al Qaeda Terrorists) గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. అరెస్టైన నలుగురు ఉగ్రవాదులు పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఎస్తో (Pak ISI) క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. మే నెలలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో కీలక సమాచారాన్ని పాక్‌కు చేరవేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
నిందితులు ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా, ఇస్లామాబాద్ సైనిక ఆపరేషన్‌కు కోడ్‌నేమ్ అయిన ఆపరేషన్ బన్యన్ అన్ మార్సూస్కు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో టెర్రర్ మాడ్యూల్ చాలా చురుగ్గా వ్యవహరించిందని సదరు వర్గాలు తెలిపాయి.
భారీ ఉగ్రకుట్ర భగ్నం..
అల్ ఖైదా (Al-Qaeda) ఉగ్రవాద సంస్థ (Terror group) భారత్‌లో భారీ దాడులకు ప్లాన్ చేసింది. అయితే అల్ ఖైదా కుట్రను గుజరాత్ (Gujarat) కు చెందిన ఏటీఎస్ పోలీసులు (ATS police) భగ్నం చేశారు. అల్ ఖైదాతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరిని గుజరాత్లో అరెస్ట్ చేయగా.. ఒకరిని ఢిల్లీ (Delhi) లో, మరొకరిని నోయిడా (Noida) లో బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్‌లోని పలు ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. అల్ ఖైదాకు సంబంధించిన ఉగ్రవాద శిబిరాలపై కూడా భారత ఆర్మీ దాడులకు పాల్పడింది. ఆ సంస్థకు చెందిన పలువురు ప్రముఖులను మట్టుబెట్టింది. దాంతో అప్పట్లోనే అల్ ఖైదా భారత్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తయ్యారు.
దేశంలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచారు. ఫలితంగా ఇప్పటికే పలు ఉగ్రకుట్రలు భగ్నం అయ్యాయి. తాజాగా మరో నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నలుగురు ఉగ్రవాదులను మహమ్మద్ ఫైక్, మహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిని అధికారులు విచారిస్తున్నారు.
Also Read..
Air India Pilots | అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత.. సిక్‌లీవ్ పెట్టిన 112 మంది పైలట్లు
Free Trade Agreement | భారత్-యూకే మధ్య కీలక ట్రేడ్ డీల్.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు
MK Stalin | హృదయ స్పందన రేటులో తేడాలు.. సీఎం స్టాలిన్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల