న్యూఢిల్లీ, డిసెంబర్ 16: అమృత్సర్లోని అట్టారి సరిహద్దు వద్ద పట్టుబడ్డ రూ.700 కోట్ల విలువైన హెరాయిన్ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక నిందితుడిని అరెస్టు చేసింది.
పంజాబ్లోని తార్న్తరన్ జిల్లాకు చెందిన అమృత్పాల్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. 2022 ఏప్రిల్ 24, 26 తేదీల్లో 102 కిలోల హెరాయిన్ అట్టారి సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పట్టుబడింది.