Ayodhya | అయోధ్య రామాలయంపై హెలికాఫ్టర్లతో పూల వర్షం
Ayodhya : అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన రామాలయంలో బాలరాముడు కొలువుతీరాడు. జై శ్రీరాం నినాదాలతో వేదమంత్రోచ్ఛారణల మధ్య రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది.
Ayodhya : అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన రామాలయంలో బాలరాముడు కొలువుతీరాడు. జై శ్రీరాం నినాదాలతో వేదమంత్రోచ్ఛారణల మధ్య రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉండే ఈ దివ్య ముహూర్తంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ క్రతువును పూర్తి చేశారు.
ఈ సందర్భంగా శ్రీరాముడికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలతోపాటు వెండి ఛత్రం, పాదుకలు అందించారు. ఇక సైనిక హెలికాఫ్టర్లలో అయోధ్య రామాలయంపై పూలవర్షం కురిపించారు. ప్రాణ ప్రతిష్ట వేడుకల సందర్భంగా హారతి ఇచ్చే సమయంలో రామాలయ ప్రాంగణంలో పలు భారతీయ సంగీత పరికరాలతో 30 మంది కళాకారులు ప్రదర్శన చేపట్టారు.
#WATCH | Indian Air Force (IAF) choppers shower flower petals over Shri Ram Janmaboomi Temple premises in Ayodhya as the idol of Ram Lalla is unveiled in the presence of Prime Minister Narendra Modi.
The air in the premises is filled with chants of ‘Jai Sri Ram’ by invitees who… pic.twitter.com/UsuBdQRCRz
— ANI (@ANI) January 22, 2024
అతిధులంతా మహా హారతి కార్యక్రమం ముగిసేవరకూ గంటలు మోగించారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ తదితర ప్రముఖులు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read More :
Arun Yogiraj: అదృష్టవంతుడిగా భావిస్తున్నా: శిల్పి అరుణ్ యోగిరాజ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

