KTR | చాయ్ తాగి, రైతులతో ముచ్చటించి.. సిరిసిల్ల రైతుబజార్లో కేటీఆర్ ప్రచారం.. ఫొటోలు
కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీ. వినోద్ కుమార్‌కు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సిరిసిల్ల పట్టణంలో ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని రైతుబజార్లో బీఆర్ఎస్కు ఓటేయాలని రైతులు, వ్యాపారులను కోరారు.
సిరిసిల్ల: కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీ. వినోద్ కుమార్‌కు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సిరిసిల్ల పట్టణంలో ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని రైతుబజార్లో బీఆర్ఎస్కు ఓటేయాలని రైతులు, వ్యాపారులను కోరారు. వారి కష్టసుఖాలను అడిగితెలుసుకున్నారు. అక్కడే ఉన్న ఓ హోటల్లో స్థానికులతో కలిసి చాయ్ తాగారు. అనంతరం మాట్లాడుతూ.. ఓట్లు అడిగేందుకు రైతు బజారుకు వచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా తాము కూర్చుని కూరగాయలు అమ్ముకునేలా షెడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని రైతులు కోరారని చెప్పారు. దీంతో 24 గంటల్లోపు వారికి తాత్కాలిక వసతి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని, కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత తమ వాగుల్లో నీళ్లు పోయాయని, ఓ నెల పింఛన్ కూడా రాలేదని ఆవుదర వ్యక్తంచేశారని తెలిపారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే పేదలకు బాగుంటుందని అంతా అన్నారని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారని, రుణమాఫీ జరగలేదని, రైతుబంధు ఇంకా సరిగా రాలేదన్నారని తెలిపారు. వారి స్పందన చూస్తుంటే కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ మంచి మెజార్టీతో గెలుస్తారని నమ్మకముందని చెప్పారు.












Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

