Danam Nagender | బంజారాహిల్స్, మే 3 : ప్రధాని మోదీకి మహిళలు ధరించే మంగళసూత్రాల విలువ తెలియదని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని లేక్ వ్యూ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో దానం నాగేందర్ మాట్లాడుతూ..
ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల మంగళసూత్రాలు కూడా లాగేస్తారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు మంగళసూత్రం ఎంత విలువైనదో, భార్య వదిలిపెట్టిపోయిన మోదీకి ఏం తెలుసు అంటూ దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ప్రధాని మోదీ వ్యక్తిగత విషయాల గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.