Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ కుప్పకూలిన ఘటనలో 242 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానంలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న గాంథియో శర్మ కొంగ్బ్రెయిల్పటమ్ (Nganthoi Sharma Kongbrailatpam) సైతం దుర్మరణం చెందింది. మణిపూర్‌కు చెందిన ఆమె మరణ వార్త విని ఆమె కుటుంబం తల్లడిల్లిపోతోంది. విమాన ప్రమాదంలో తమ కూతురు చనిపోయిందనే విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసినం. నువ్వు ఎక్కడికి వెళ్లి పోయావు తల్లీ అంటూ వాళ్లు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తమ ఫ్యామిలీ ఫొటో ఆల్బమ్‌లో ఫొటో చూసుకుంటూ తమ కూతురిని తలచుకుంటూ వలవల ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
VIDEO | Ahmedabad plane crash: Family members of Nganthoi Sharma Kongbrailatpam, a crew member on board Air India flight AI171 en route to London, break down in grief upon receiving news of the tragic incident.#AhmedabadPlaneCrash #planecrash
(Full video available on PTI… pic.twitter.com/djxkfR22Op
— Press Trust of India (@PTI_News) June 12, 2025
విమాన ప్రమాదంలో గాంథియో చనిపోయిందనే విషయం తెలియగానే ఆమె ఇంట విషాదం నెలకొంది. తమ కుటుంబం ఫొటో ఆల్బమ్‌ను తిరగేస్తూ.. తమ బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ గుండెలు బాదుకుందీ ఆమె తల్లి. ‘నా బిడ్డ.. నువ్వు ఎక్కడ. నిన్ను ఈ చేతులతో పెంచాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్లి పోయావు. నాకు నిన్ను చూడాలని ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నావు?.. నా ఫోన్ తీసుకురండి. అందులో నా కూతురి ఫొటో చూస్తాను’ అంటూ గాంథియో తల్లి రోదిస్తున్న తీరు ప్రతిఒక్కరి హృదయాలను కరిగిస్తోంది.
గురువారం మధ్యాహ్నం ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం లండన్‌కు బయల్దేరించింది. అందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీషర్లు, 8 మంది పోర్చుగల్ దేశస్థులు సహా కెనడాకు చెందిన ఒకరు అయితే.. టేకాఫ్ అయిన 2-3 నిమిషాల్లోనే చెట్టును ఢీకొని సమీపంలోని వైద్య కళాశాల వసతి గృహం భవంతిమీద పడిపోయింది. అనంతరం భారీ పేలుడుతో విమానం తునాతునకలైంది. ఈ ఘటనలో వైద్య కళాశాలలోని 20 మంది మెడికోలు ప్రాణాలు విడిచారు.
Ramesh Viswashkumar, The sole survivor of the Air India crash escaped by jumping from the plane. He was on seat number 11A. #AirIndia #AhmedabadNews #Gujarat #PlaneCrash #ITReel pic.twitter.com/NsMBeZOkbX
— IndiaToday (@IndiaToday) June 12, 2025
యావత్ ప్రపంచాన్నిఉలిక్కిపడేలా చేసిన ఈ ప్రమాదంలో ఒకేఒక్కడు మృత్యుంజయుడిలా బయటపడ్డాడు. శవాల దిబ్బగా మారిన ఘటనా స్థలం నుంచి రమేశ్ విశ్వకుమార్ (Ramesh Vishwa Kumar) అనే 38 ఏళ్ల వ్యక్తి నడుచుకుంటూ అంబులెన్స్ వరకూ వెళ్లాడు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. ఊహించుకోవడానికే వణుకు పుట్టే ఈ ప్రమాదంలో రమేశ్ ప్రాణాలతో ఉండడం నిజంగా అద్భుతం.