PDP | జమ్ముకశ్మీర్లో ఇండియా కూటమికి బీటలు.. ఒంటరిగానే పోటీ చేస్తామంటున్న పీడీపీ
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్ష ఇండియా కూటమికి (India alliance) వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఇప్పటికే కూటమి నుంచి జేడీయూ బయటకు వెళ్లగా, పశ్చిమబెంగాల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు.
శ్రీనగర్: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్ష ఇండియా కూటమికి (India alliance) వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఇప్పటికే కూటమి నుంచి జేడీయూ బయటకు వెళ్లగా, పశ్చిమబెంగాల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. అదేవిధంగా పంజాబ్, ఢిల్లీలోని అన్ని స్థానాల్లో ఆప్ బరిలోకి దిగుతుందని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాజాగా, జమ్ముకశ్మీర్లో కూడా ఇలాంటి సమస్యే ఉత్పన్నమయింది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) సారధ్యంలోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP) లోక్సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించింది. పార్టీ పార్లమెంటరీ కమిటీ త్వరలో అభ్యర్థుల పేర్లను ప్రకటించనుందని తెలుస్తున్నది. గతంలోనే నేషనల్ కాన్ఫరెన్స్ (NC) తాము ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేస్తామని ప్రకటించింది.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి చర్చించేందుకు సెంట్రల్ కశ్మీర్లో జరిగిన పీడీపీ సమావేశంలో మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు పార్టీ సిద్ధమైందని, త్వరలో రాష్ట్రంలోని లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నామని ప్రకటించారు. మహ్మద్ సర్తాజ్ మదానీ నేతృత్వంలోని పార్టీ పార్లమెంటరీ బోర్డు త్వరలో అభ్యర్థులను ఖరారు చేస్తుందని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

