Earthquake | అండమాన్ సముద్రం (Andaman Sea)లో వరుస భూకంపాలు (Earthquakes) సంభవించాయి. ఇవాళ ఉదయం నుంచి ఏకంగా మూడు సార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4 కంటే ఎక్కువగానే ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.
తొలుత సోమవారం ఉదయం 10:09 గంటల సమయంలో భూమి కంపించింది. భూకంపం తీవ్రత 4.7గా నమోదైంది. ఆ తర్వాత గంటన్నరకే అంటే ఉదయం 11:22కు మరోసారి భూమి కంపించింది. అప్పుడు భూకంపం తీవ్రత 4.6గా నమోదైంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12:06కి మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 4.7తీవ్రతతో కంపించినట్లు ఎన్సీఎస్ వెల్లడించింది. వరుస ప్రకంపనలతో సముద్రంలో అల్లకల్లోలం నెలకొంది. కెరటాలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. తీర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. ఈ నెల 25న కూడా అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలు (Richter scale)పై భూకంపం తీవ్రత 4.2గా నమోదైంది.
Also Read..
Bomb Threat | దేశంలోని పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
Shimla | భారీ వర్షాలు.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం